V1News Telangana

best news portal development company in india

మహిళను బెదిరించి సొమ్ములు దోచుకున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు….

SHARE:

 

 

– మీడియా సమక్షంలో వివరాలు వెల్లడించిన డిఎస్పి విట్టల్ రెడ్డి

 

బాన్సువాడ ప్రతినిధి:

 

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను బెదిరించి ఆమె వద్ద నుండి నగదు మరియు నగలు దోచుకున్న కేసును చేదించినట్లు బాన్సువాడ డిఎస్పి విట్టల్ రెడ్డి ఆదివారం రోజు మీడియా సమావేశం నిర్వహించి తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ మహిళను బెదిరించి డబ్బు, బంగారం, ఫోన్ దోచుకున్న నిందితుడు నీరడి సాయిలును మరియు దొంగ సొత్తును కొనుగోలు చేసిన బుర్ర వెంకటరమణ అనే వ్యక్తులను అరెస్టు చేసి చోరీకి గురైన సొత్తును రికవరీ చేసి రిమాండ్ కు తరలించామని తెలియజేశారు. చోరీకి పాల్పడిన నిందితుడు నేరడి సాయిలుపై గతంలో కూడా బాన్సువాడ, నిజాంసాగర్, లింగంపేట్, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడిన కేసులు నమోదు అయి ఉన్నాయని తెలిపారు. త్వరితగతిన కేసును చేదించడం పట్ల పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. అపరిచిత వ్యక్తులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. మహిళలు బయట పనులపై వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కుటుంబ సభ్యులను తోడుగా తీసుకువెళ్లాలని తెలిపారు. ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించినట్లయితే వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india