రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన బోధన్ యువతి ఆర్.మౌనిక..
ప్రశంసించిన పట్టణ ప్రముఖులు సహచర ఉద్యోగస్తులు.

బోధన్ : 2022,ఆగష్టు 27న,181 పోస్టులతో టిజిపిఎస్సి విడుదల చేసిన తెలంగాణా మహిళా శిశు సంక్షేమ శాఖ ఎక్స్టెన్షన్ ఆఫీసర్(విస్తరణ అధికారి) ఫలితాలలో బోధన్ కు చెందిన కుమారి ఆర్.మౌనిక ఎంపికై సత్తా చాటింది.ఆమె ఇప్పటికే గ్రూప్ 4 ఉద్యోగం సాధించి బోధన్ మునిసిపాలిటీలో వార్డు అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.తండ్రి అప్పలనాయుడు బోధన్ లో ఇందూర్ బీఎడ్ కాలేజి ప్రిన్సిపల్ గా మరియు తల్లి కమల కుమారి ఆధ్యాత్మిక శిక్షకురాలు తమ కుమార్తె రెండో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.అదే విధంగా బోధన్ మునిసిపల్ కమీషనర్ మరియు ఇతర సహోద్యోగులు,సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దనే స్టాండర్డ్ కాంపిటేటివ్ బుక్స్ చదివి స్వయంగా సన్నద్దమయ్యారు.భయం,ఒత్తిడి లేకుండా ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయడానికి తనకు మెడిటేషన్,శాకాహారం బాగా సహకరించాయని పేర్కొన్నారు.భవిష్యత్తులో సేవిల్ సర్వీస్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








