– రంగురంగుల పూలతో బతుకమ్మలను ముస్తాబు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు
– దసరా ఉత్సవాల్లో సాక్షాత్తు అమ్మవారి వేషధారణలో ఒళ్ళు గగుర్పొడిచేలా అలరించిన చిన్నారుల ప్రదర్శనలు
– భావితరాలకు మన పండగల యొక్క ప్రాధాన్యతను అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించిన ఉపాధ్యాయులు
– సాయి సిద్ధార్థ హైస్కూల్ యాజమాన్యం
దమ్మాయిగూడ ప్రతినిధి:
మేడ్చల్ జిల్లా V1 న్యూస్ (21): కీసర మండలం దమ్మాయిగూడలో సాయి సిద్ధార్థ హైస్కూల్ యాజమాన్యం శనివారం రోజు పాఠశాలలో విద్యార్థులకు ముందస్తుగా బతుకమ్మ మరియు దసరా పండుగ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని,విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది అందరూ సాంప్రదాయబద్ధంగా నూతన వస్త్రాలను ధరించి భక్తిశ్రద్ధలతో రంగురంగుల పువ్వులతో అందంగా బతుకమ్మలను ముస్తాబు చేసి కొలుచుకుంటూ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా ఆనందోత్సాహాలతో ఆటపాటలతో అలరించారు. అనంతరం విజయదశమి పండగ ఉత్సవాలలో భాగంగా విద్యార్థులు అమ్మవారి వేషధారణలో సాక్షాత్తు అమ్మవారు దర్శనమిచ్చినట్లుగా కన్నుల పండుగగా ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సాయి సిద్ధార్థ పాఠశాలలో ఇదేవిధంగా ముందస్తుగా పండుగలను విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు, క్రమశిక్షణతో పాటు భావితరాలకు మన పండగల యొక్క ప్రాధాన్యతను కూడా తెలియజేయడానికి తమ వంతు ప్రయత్నాలను నిర్విరామంగా చేస్తున్నామని గర్వంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








