Post Views: 73
వి1దినపత్రిక (సెప్టెంబర్ 18)బోధన్ : సాలూర ప్రజ్ఞ శ్రీ హై స్కూల్ లో గురువారం జరుపుకున్న బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి.
మహిళ ఉపాధ్యాయులు మరియు విద్యార్థినిలు తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా చీరలు పూలు ధరించి ఆకర్షనీయంగా నిలిచారు.తెలుగు సాంప్రదాయాలను మైమరిపించే విధంగా రంగురంగుల పువ్వులు,కాగితాలతో బతుకమ్మలను పేరించారు.బతుకమ్మలకు సంస్కృతి సాంప్రదయాలను అనుసరిస్తూ పూజలు నిర్వహించారు.

బతుకమ్మలను పాఠశాల ఆవరణలో ఉంచి రకరకాల బతుకమ్మ పాటలను పాడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు.తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చిరునామాగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలు సాలురా ప్రజ్ఞ శ్రీ హైస్కూల్లో అంబరాన్ని అంటాయి.మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కన్నతల్లిగా భావించి పూలతో ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు.
సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళా ఉపాధ్యాయులు,విద్యార్థినీలు బతుకమ్మ ఆడుతూ తెలుగు సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియపరచుకున్నారు.తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చిరునామా గా నిలిచే బతుకమ్మ ఉత్సవాలు విశ్వవ్యాప్తమయ్యాయి.ఈ పండగ సాహిత్యం,నృత్యం,సంగీతం, చిత్రం,శిల్పం కలయికనని పరిశోధకులు చెబుతుంటారు.ఎంతో కీర్తి కలిగిన బతుకమ్మ విశిష్టత కొనసాగడానికి పూల బతుకమ్మ నిదర్శనంగా నిలుస్తుంది.బతుకమ్మను పూలతో అలంకరించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.తెలుగు సాంప్రదాయాలను అనుసరిస్తూ సాలూర శివారులోని మంజీరా నదిలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ లతా రాజు,ఉపాధ్యాయ బృందం,విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....










