V1News Telangana

best news portal development company in india

ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బిజెపి నాయకులు….

SHARE:

 

 

– రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అర్చన నిర్వహణ

 

– ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ

 

– బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు

 

నసురుల్లాబాద్ ప్రతినిధి:

 

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజు భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అర్చన నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పండ్లు పంపిణీ చేసి వారి సమక్షంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలు హర్షించే విధంగా అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. ఆయన పరిపాలనలో దేశాభివృద్ధి కొరకు మరియు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 అమలు చేయడం, ముస్లిం సోదరీమణుల సంక్షేమానికి ట్రిపుల్ తలాక్ రద్దు, వక్ఫ్ బోర్డు చట్ట సవరణ, ఆపరేషన్ సింధూర్ వంటి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు అమలుపరిచి దేశాన్ని సంరక్షిస్తూనే .. ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుడిగా అందరి మన్ననలు పొందుతున్నారని అన్నారు. భగవంతుడి ఆశీర్వాదాలతో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని.. వారి నాయకత్వంలో దేశం సుభిక్షంగా , ఎంతో అభివృద్ధి చెంది ప్రజలందరూ సంతోషంగా జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అనుసూరి శ్రీనివాస్, అరిగె నారాయణ, గొడిసెల యాదగిరి గౌడ్, అనిల్ గుప్త ,దుర్గం సంజీవులు ,మిట్ట గంగాధర్, బాస్కల్ల సాయిలు, ఎస్.వి.శర్మ, సురేష్, కంది పెద్ద మల్లేష్, భరద్వాజ్ శర్మ, ర్యాపని మహేష్ ,ఉల్లెంగ గోపి, ఉల్లెంగ పర్వయ్య, బత్తిని రాజు,రాఘవులు, మల్లయ్య, కిష్టయ్య, సాయిలు, కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india