Post Views: 101
బోధన్, సెప్టెంబర్ 17:
బోధన్ పట్టణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణలు నిర్వహించగా, ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
ఈ వేడుకల్లో భాగంగా సబ్ కలెక్టర్ వికాస్ మాహతో, తహసీల్దార్ విట్టల్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తమ తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడి పాత్ర అత్యంత కీలకమని అధికారులు పేర్కొన్నారు.
ప్రజాపాలన విలువలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నాయకులు పాషా మొయినుద్దీన్, తూము శరత్ రెడ్డి, అంకు దాము, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









