V1News Telangana

best news portal development company in india

సాలురా పిహెచ్ సీ సెంటర్ లో ఘనంగా రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకలు.

SHARE:

— ఘనంగా రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం.
— గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటు.
— రోగులకు ఉచితంగా మందుల పంపిణీ.
— వైద్య సేవలు అందించడంలో ప్రత్యేక చొరవ.
— మండల వైద్య ప్రత్యేక అధికారి డాక్టర్ రాజ్ కుమార్.
బోధన్ : సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్య ప్రత్యేక అధికారి డాక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.వైద్య సిబ్బంది,రోగులు,ప్రజలకు మిఠాయిలను పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ రాజకుమార్ మాట్లాడుతూ సాలూర ప్రజలకు మరియు మండల ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ జిల్లా వైద్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందిస్తున్నామన్నారు.ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో రోగుల పట్ల విధేయతగా ఉంటూ వైద్య సేవలను అందిస్తున్నట్లు డాక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ రోజా,సూపర్వైజర్ సత్యం, 108 సిబ్బంది, పి హెచ్ సి సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india