విజయవాడ సెప్టెంబర్15కొంతమంది హిజ్రాల ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది. జుగుస్సకరంగా ప్రవర్తిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శుభ, ఆశుభ కార్యం ఏదైనా సరే దందా మొదలుపెడతారు. గృహప్రవేశాలు పెళ్లిళ్లు పుట్టినరోజు వేడుకలకు ఇలా కార్యక్రమం ఏదైనా సరే ఇండ్ల వద్దకు ఇట్టే వాలిపోతుంటారు. వేలకు వేలు డిమాండ్ చేసి ఇంటి యజమానులను ఇబ్బందు లకు గురి చేస్తున్నారు.
వారి ఆగడాలను తట్టుకో లేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బదులు పడుతున్నారు. ఈ సందర్భంగా హిజ్రాల దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం నగరంలో పలువురు ఆందోళనకు దిగారు. ఈ నెల 13వ తేదీన హిజ్రాల వేధింపులను తట్టుకోలేక సత్య కుమారి అనే మహిళ కూడా ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం సోమవారం నాడు కుటుంబ సభ్యులకు మృత దేహాన్ని అప్పగించారు.
దీంతో గిరిపురం సెంటర్ దగ్గర మృతదేహంతో మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. విజయవాడలో హిజ్రాలపై కఠిన చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేస్తూ నడి రోడ్డుపై బైఠాయించారు. ఇక, సమాచారం తెలుసు కున్న మాచవరం పోలీసు లు, అక్కడికి చేరుకొని మృతురాలి బంధువులతో చర్చలు జరిపారు.
ఆందోళన చేయకండి.. వారిపై తగిన చర్యలు తాము తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ సందర్భంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న హిజ్రాలే టార్గెట్ గా కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధం అవుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








