సాలూర : ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు పెన్షన్లను పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సాలూర ఎమ్మార్పీఎస్ నాయకులు,వికలాంగుల ఆధ్వర్యంలో సోమవారం సాలూర తహసిల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ,వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్య వంశీ పిలుపు మేరకు మండలాల తహసిల్దార్ కార్యాలయ ఎదుట ధర్నా కార్యక్రమాలలో భాగంగా వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని విమర్శలు చేశారు.ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు గడుస్తున్న వికలాంగులకు పెన్షన్లను పెంచి ఇవ్వకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు పెన్షన్లను ఇచ్చిన మాట మేరకు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేదంటే ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్పీఎస్ మండల ప్రచార కార్యదర్శి రెడ్డి శ్యామ్,నాయకులు నాగురావు,రెడ్డి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








