రుద్రూర్:
రుద్రూర్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి (విహెచ్పి) ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగుల సంక్షేమం అభివృద్ధి కోసం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన అంశాలతో పాటు పలు పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ నేతృత్వంలో ఈ ఆందోళన జరిగింది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వికలాంగుల సంక్షేమంపై ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ సమితి అభినందనలు తెలిపింది. కానీ ఇప్పటివరకు ఈ వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేసింది.
సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ “ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటినా వికలాంగుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ వర్గం సామాజిక వివక్షతకు గురవుతూ ఉండటమే కాకుండా, తల్లిదండ్రులు, తోడబుట్టినవారు, జీవిత భాగస్వాములు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు” అని తెలిపారు.
ఇప్పటికైనా ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలతో పాటు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని సమితి ప్రభుత్వాన్ని కోరింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








