Post Views: 151
సర్టిఫికెట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఈ సాయం అందజేస్తుంది. సొంత వాహనం కలిగి, దాన్ని నడిపే డ్రైవర్లకు ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందించనుంది.
👉 దరఖాస్తుదారులకు ఏపీలో జారీ చేసిన ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి.
👉 వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ వంటి సర్టిఫికెట్లు ఉండాలి.
👉 ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోయినా 2025-26 సంవత్సరానికి అనుమతిస్తారు. ఒక నెలలోపు ఆ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
👉 ప్యాసింజర్ ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు వర్తిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉండాలి/రేషన్ కార్డు కలిగి ఉండాలి.
👉 దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్ గా ఉంటే అనర్హులు. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది.
👉 ఇంటి విద్యుత్తు వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. దరఖాస్తు తేదీకి ముందు 12 నెలల సగటు లెక్కిస్తారు.
👉 వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు.
👉 మాగాణి అయితే 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస, వాణిజ్య నిర్మాణం ఉండకూడదు.
👉 ఈనెల 15 నాటికి వాహనాల జాబితా, రిజిస్ట్రేషన్ నంబరు, యజమాని పేరు, చిరునామా, ఫోన్ నంబరుతో కూడిన వివరాలను ప్రభుత్వం జీఎస్ డబ్ల్యూఎస్ కు అందిస్తుంది.
👉 తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా 2023-24లో ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విశ్లేషిస్తారు.
👉 ఈ పథకానికి దరఖాస్తు చేసుకోడానికి గ్రామ, వార్డు సచివాలయాల విభాగం (జీఎస్ఈబ్ల్యూఎల్డీ) ఈనెల 17న నాటికి దరఖాస్తుల స్వీకరణకు ఆన్లైన్ ప్లాట్ పామ్ ను సిద్ధం చేస్తుంది.
👉 కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 19 వరకు అవకాశం కల్పిస్తారు.
👉 ఈ నెల 22 నాటికి సచివాలయం, మండల, జిల్లా స్థాయి క్షేత్ర పరిశీలన పూర్తి చేస్తారు. తుది జాబితా 24కు సిద్ధమవుతుంది.
👉 లబ్ధిదారుల జాబితాను కార్పొరేషన్ల వారీగా జీఎస్ఈడబ్ల్యూఎస్ విభాగం 24 నాటికి రవాణా శాఖకు పంపుతుంద
👉 ఆర్థిక సహాయాన్ని సీఎం చంద్రబాబు అక్టోబరు 1న బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








