V1News Telangana

best news portal development company in india

బోధన్ గర్వించదగ్గ వ్యక్తి – ప్రొఫెసర్ పల్లవి కబ్డే

SHARE:

హైదరాబాద్, సెప్టెంబర్ 13:

బోధన్ పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, ప్రస్తుతం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (హైదరాబాద్)లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతిగా కొనసాగుతున్న ప్రొఫెసర్ పల్లవి కబ్డే విద్యా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
పల్లవి కబ్డే గారు తమ పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యను బోధన్‌లోనే పూర్తిచేశారు. అనంతరం 2004లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎం.ఎ. గోల్డ్ మెడలిస్ట్‌గా నిలిచారు. 2016లో మురికివాడలలో మహిళా సాధికారతపై విశేష పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి పొందారు.

కుటుంబం

ఆమె తల్లిదండ్రులు శ్రీమతి రంజనా కబ్డే మరియు లాలే సోయి సురేందర్ కబ్డే. జీవిత భాగస్వామి శ్రీ సుధీర్ సులకే ఒక సొంత కంపెనీకి వ్యవస్థాపకుడు మరియు CEO. వీరికి అనన్య (4వ తరగతి), మోక్షు (బి తరగతి) అనే ఇద్దరు సంతానం ఉన్నారు.

బోధనా రంగంలో విశిష్ట అనుభవం…

దాదాపు రెండు దశాబ్దాలుగా పీజీ మరియు యూజీ స్థాయిలలో బోధన అందిస్తున్నారు. అదేవిధంగా పిహెచ్.డి స్కాలర్లకు సైతం మార్గదర్శకత్వం వహిస్తూ అనేకమందికి స్ఫూర్తిదాయకురాలిగా నిలుస్తున్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india