Post Views: 333
నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణం:బోధన్ పట్టణ బైపాస్ బాబా గార్డెన్ రోడ్డుపై ప్రతిష్ఠాత్మకంగా నిలబెట్టిన శ్రీ వీరభద్ర స్వామి వారి విగ్రహాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
విగ్రహాలు ఉన్న ఆవరణలో ఎముకలు, ప్లాస్టిక్ కవర్లు, చెత్త రాశులు పేరుకుపోవడంతో పవిత్ర స్థలం చెండాలంగా మారిపోయింది. భక్తులు, పట్టణ ప్రజలు చూసి బాధపడే పరిస్థితి ఏర్పడింది. 🚩
ఆలయ రూపంలో తీర్చిదిద్దకపోవడంతో ఆ విగ్రహాలు ప్రస్తుతం శీలాస్థితిలోనే ఉండిపోవడం స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “దేవతా విగ్రహాలు గౌరవం పొందేలా చర్యలు తీసుకోవడం పట్టణ వాసుల బాధ్యత” అని కొందరు భక్తులు అభిప్రాయపడ్డారు.
బోధన్‌లో ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలవాల్సిన వీరభద్ర స్వామి విగ్రహాలు ఇలా నిర్లక్ష్యానికి గురవడం విచారకరం అని పలువురు స్థానికులు పేర్కొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








