V1News Telangana

best news portal development company in india

🚨 ఇసుక ట్రాక్టర్లు, ఆటోలు సీజ్ – కోర్టుకేనా డిపాజిట్?

SHARE:

👉 సాలూర వద్ద 4 ట్రాక్టర్లు – 2 ట్రాలీ ఆటోలు స్వాధీనం
👉 మండల తహసిల్దార్ శశిభూషణ్ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు
👉 వాహనాలను బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు
👉 జరిమానాలతో వదిలేస్తారా? లేక నేరుగా కోర్టుకు డిపాజిట్ చేస్తారా?
👉 ప్రజల్లో అనుమానాలు – అధికారులపై నమ్మకం లేదా..?
సాలూర మండలం మందర్న మంజీరా పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు, రెండు ట్రాలీ ఆటోలు పట్టుబడ్డాయి. మండల తహసిల్దార్ శశిభూషణ్  వాహనాలను సీజ్ చేసి బోధన్ రూరల్ ఠాణాకు తరలించారు.
ఇసుక రవాణా అనుమతులు లేకుండా వాహనాలు నడుస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు – కేసులు, భారీ జరిమానాలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇలాంటి సందర్భాల్లో వాహన యజమానులు జరిమానాలు కట్టి సులభంగా బయటపడతారా? లేక కోర్టులోనే వాహనాలను డిపాజిట్ చేస్తారా? అన్న అనుమానాలు ప్రజల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india