– రూ.5000 ఆర్థిక సహాయం అందజేత, అండగా ఉంటామని భరోసా
– బాన్సువాడ బిజెపి నాయకులు NRI, కోనేరు శశాంక్
– పోతంగల్ మండల సీనియర్ నాయకులు మార్కెలి ప్రకాష్ పటేల్
పొతంగల్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం పొతంగల్ మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన ఒంటరి మహిళ కొడిచెర్ల సాయమ్మ కు చెందిన రేకుల ఇల్లు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కూలిపోయింది. ఆమె ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయం తెలుసుకున్న బిజెపి బాన్సువాడ నాయకులు,NRI కోనేరు శశాంక్ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆమెకు గురువారం రోజు 5000 రూపాయలు ఆర్థిక సహాయం బిజెపి పొతంగల్ మండల సీనియర్ నాయకులు మార్కెలి ప్రకాష్ పటేల్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ పటేల్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల కారణంగా గృహాలు ధ్వంసమైన బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు అధికారులు క్షేత్రస్థాయిలో నష్టపోయిన బాధితుల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తరఫునుండి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని హెచ్చరించారు. నియోజకవర్గంలోని పేద ప్రజలకు, నష్టపోయిన బాధితులకు పలు రకాల సేవా కార్యక్రమాలతో అండగా నిలుస్తున్నందుకుగాను కోనేరు శశాంక్ ను అభినందించారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఆమెకు సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలోని కొడిచెర్ల చిన్నమ్మ అనే మహిళ ఇంటిలో తేలికపాటి కూడా ఇంట్లో నీరు కారణం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయాన్ని తెలుసుకున్న కోనేరు శశాంక్ వారికి ఇంటిపై కప్పుకోవడానికి టార్పాలిన్ కవర్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. సహకారం అందించడం పట్ల బాధితులు నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు డి .మక్కయ్య, మేత్రి కిరణ్, ఓమన్న పటేల్, యం.సంతోష్ పటేల్, గంగాధర్ పటేల్, బూత్ అధ్యక్షులు వినోద్, రమేష్, విజయ్, కల్లూరు గ్రామానికి చెందిన పెద్దలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








