– అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేస్తున్న నసురుల్లాబాద్ గ్రామ వాసులు
– రూ. 20, 461 బాధిత కుటుంబానికి అందజేత
– ఐకమత్యంతో బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న వైనం
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా(10) V1 న్యూస్: నసురుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన గ్రామస్తులు చేయి చేయి కలిపి మానవత్వాన్ని చాటుతున్నారు. గ్రామంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామ ప్రజలందరూ ఏకతాటి పైకి వచ్చి బాధితుల కష్టాన్ని పంచుకుంటూ బాధలో ఉన్న కుటుంబాలను ఓదారుస్తూ, తమ వంతు నగదును పోగుచేసి అందిస్తూ ఆదుకుంటున్నారు. అందులో భాగంగా నసురుల్లాబాద్ గ్రామానికి చెందిన చాకలి కిష్టవ్వ శనివారం మరణించడంతో ఆl కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గ్రామ కమిటీ నుండి రూపాయలు 10,000 అంత్యక్రియలకు అందించారు. అంతేకాకుండా గ్రామంలోని ప్రజలు వయోపరిమితి లేకుండా గ్రామ అభివృద్ధి కమిటీ పేరుతో వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసుకుని ఎవరికి తోచిన సహాయం వారు ఆన్లైన్ ద్వారా మరియు నగదు రూపంలో సహాయం చేశారు. మొత్తం నగదును పోగు చేసి బుధవారం రోజు రూ .20,461 బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆర్థిక సహాయం అందజేయడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు తమ వంతు సహాయాన్ని అందజేసి ఆదుకోవాలనే సదుద్దేశంతో గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు కంది మల్లేష్, మాజీ సర్పంచ్ అరిగె సాయిలు, మాజీ ఎంపిటిసి శంకర్ నాయక్, గ్రామ ప్రజలు అయినాల లింగం, ముత్తకుంట వేణుగోపాల్ గౌడ్, చుంచు పెద్ద సాయిలు, అల్లం గంగారాం, అరిగె రవి, చుంచు వెంకన్న, భోధనం గంగారాం, చాకలి సాయి, టేకుర్ల గంగారాం, తర్ణం పోచయ్య, గూడెం రవి, టేకుర్ల సాయిలు, బత్తుల నర్సింలు, టేకుర్ల లాలయ్య, కటికె రాములు,తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








