Post Views: 69
నగరంలో అసాంఘిక వాతావరణం – అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు…
బార్ యజమానుల దురాక్రమణ: తెల్లవారుజామునే మద్యం సరఫరా!…
నిజామాబాద్ నగరంలో బార్‌ల బహిరంగ ఉల్లంఘనలు – ప్రజలు ఆందోళనలో..
. ఆదేశాలు తుంగలో తొక్కుతున్న బార్‌లు… నిబంధనలపై ఎవరికి పట్టింపు?…
నిజామాబాద్ నగరం:నగరంలో బార్‌లు, రెస్టారెంట్లు నిబంధనలను గాలికి వదిలేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, చాలా చోట్ల తెల్లవారుజామున వరకూ బార్‌లు తెరిచే ఉన్నాయనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.
స్థానికులు చెబుతున్నదేమిటంటే—రాత్రివేళల్లో బార్‌ల చుట్టుపక్కల గొడవలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినా తగిన స్పందన లభించడం లేదని వాపోతున్నారు. కొత్తగా వచ్చిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కఠిన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకపోవడం ప్రజల్లో అసహనం కలిగిస్తోంది.
అదేవిధంగా, తెల్లవారుజామునే ఉదయం 8 గంటలకు మద్యం సరఫరా చేస్తూ జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆహార పదార్థాలు సిద్ధం చేసే ప్రదేశాల్లో పరిశుభ్రత లేకపోవడం, మరుగుదొడ్లు సరిగా నిర్వహించకపోవడంతో దుర్వాసన వెదజల్లడం వినియోగదారుల ఆగ్రహానికి దారితీస్తోంది.
వైద్య నిపుణులు కూడా ఈ నిర్లక్ష్యం ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. నిబంధనల అమలులో ఎక్సైజ్, పోలీస్ శాఖలు సడలింపు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొంతమంది బార్ యజమానులు అధికారులకు ముడుపులు చెల్లించడం వల్లే ఈ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరవాసులు తక్షణమే చర్యలు తీసుకుని, ప్రజల భద్రతను కాపాడాలని అధికారులను కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









