V1News Telangana

best news portal development company in india

విదేశీ నేలపై తెలుగు తేజం – ఉపాధ్యాయులకు గౌరవం, భాషకు నూతన శోభ . ఉపాధ్యాయ దినోత్సవం – విద్యావేత్తలకు సన్మానం, సత్కారం రియాద్‌లో..

SHARE:

“భాష ఒక జాతి ప్రాణం” – తెలుగు భాషా దినోత్సవం ఘనతకు నిదర్శనం

. సౌదీలో తెలుగు జాతి గర్వకారణం – భాషా దినోత్సవం & గురుపూజోత్సవం కలయిక

 సౌదీ అరేబియాలో తెలుగు సంబరాలు – భాషా దినోత్సవం + గురుపూజోత్సవం..

రియాద్ (సెప్టెంబర్ 5): సౌదీ అరేబియాలో తెలుగు సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ, రియాద్‌లో తెలుగు భాషా దినోత్సవం మరియు ఉపాధ్యాయ దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో, సక్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణం ఈ వేడుకలకు వేదికగా నిలిచింది.
సాటా ఫౌండర్ మల్లేష్, స్కూల్ యజమాని డా. మాసూద్, రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. “సౌదీలో నివసిస్తూ మన భాష, మన గురువుల పట్ల గౌరవాన్ని చూపడం ఒక గొప్ప సంస్కృతి” అని శ్రీనివాస్ మచ్చ అన్నారు.
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకట రామమూర్తి గారి కృషిని స్మరించుకున్నారు. గురజాడ, వేమన, తెనాలి రామలింగ వినోదం, శ్రీకృష్ణదేవరాయల “దేశభాషలందు తెలుగు లెస్స” అన్న వాక్యం పునఃస్మరణ అయింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారతదేశ రెండవ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి సేవలను గుర్తుచేసుకున్నారు.
పది సంవత్సరాలకుపైగా విద్యారంగంలో సేవలందించిన ఉపాధ్యాయులను సన్మానించి మెమెంటోలు అందజేశారు. ఈ వేడుకలో యాంబు అధ్యక్షులు కాశీరాజు, జెడ్డా అధ్యక్షులు అంజాద్, ఈస్ట్రన్ రీజియన్ అధ్యక్షులు తేజ, TASA ఫౌండర్ స్వామి పాల్గొన్నారు. జెడ్డా అధ్యక్షుడు అంజాద్ తన పాటలతో అందరినీ అలరించారు.
ఈ విజయవంతమైన వేడుకకు రియాద్ కోర్ టీమ్ సభ్యులు శర్వాణి విద్యాధరణి, కోకిల ఒథెలూరి, ప్రీతి, మహమ్మద్ నూరుద్దీన్, లోకేష్ తాళ్ల తదితరులు విశేష కృషి చేశారు..
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india