– కోనేరు ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్న యువ నాయకుడు
– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్
రుద్రూర్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: రూద్రూర్ మండల కేంద్రంలో గల ఎస్సీ కాలనీలో గత కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా శిథిలావస్థకు చేరిన గృహాలను బిజెపి నాయకులు NRI కోనేరు శశాంక్ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. వారితో పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. వారికి మనోధైర్యం అందించి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన వారికి ఇంటిపై కప్పుకోవడానికి తనవంతు సహాయంగా టార్పాలిన్ కవర్స్ అందజేశారు. ఈ సందర్భంగా కోనేరు శశాంక్ మాట్లాడుతూ వర్షాకాలంలో శిథిలావస్థకు చేరిన ఇల్లల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వరద బాధితులకు తక్షణ సాయం అందించాలని అన్నారు. లేనియెడల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పార్వతీ మురళి, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు కృష్ణంరాజు,బేగరి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు ఏముల గజేందర్, వడ్లసాయినాథ్, బీజేవైఎం మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్, SC మోర్చా మండల అధ్యక్షులు బేగరి శివప్రసాద్, బేగరి సాయికుమార్, మండల కార్యదర్శి ధర్మవరం వెంకటేష్,మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








