V1News Telangana

best news portal development company in india

బోధన్ బస్టాండ్ వ్యాపారులకు గిరాకీ లేని గిరికీలు!

SHARE:

. బస్సులు బస్టాండ్ కు రాక… వ్యాపారులకు నష్టాలే!

 చౌరస్తా బస్టాండ్ అవతారం – వ్యాపారులు ఆవేదనలో!

. నెల రోజులుగా గిరాకీ సున్నా… అద్దె మాత్రం ముప్పై వేలే!

. కెనాల్ బ్రిడ్జి పనులు ఆలస్యం… వ్యాపారులపై నష్టభారం!

 

 

 

 

బోధన్:

బోధన్ బస్టాండ్ ప్రాంతంలో వ్యాపారం బాగా దెబ్బతింది. బన్సవాడ వెళ్లే బస్సులు బస్టాండ్ లోకి రాకపోవడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షర్బతి కెనాల్ బ్రిడ్జి పనులు నెల రోజులుగా కొనసాగుతున్న కారణంగా బస్సులు దారిమళ్లించి చౌరస్తా వద్ద ఆపుతున్నారు. ఫలితంగా చౌరస్తానే ఒక బస్టాండ్‌గా మారిపోయింది.
 
“నెల రోజులుగా ఒక్క గిరాకీ లేకపోయినా ముప్పై నుండి నలభై వేల వరకు అర్టిసికి అద్దె కడుతున్నాం. ఇది మాకు భరించలేని భారమవుతోంది” అని వ్యాపారులు షేక్ షాదుల్, లతీఫ్, గంగాధర్, రమేష్, నహీం వాపోయారు.
బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేసి, బస్సులు బస్టాండ్ లోకి వచ్చేలా చూడాలని అధికారులను వ్యాపారులు విజ్ఞప్తి చేశారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india