V1News Telangana

best news portal development company in india

సెప్టెంబర్ 10 లోపు టాస్క్ కోర్సులలో యువత రిజిస్ట్రేషన్ చేసుకొవాలి- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష /// ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలో టాస్క్ కోర్సుల పై అవగాహన కల్పించాలి

SHARE:

సెప్టెంబర్ 10 లోపు టాస్క్ కోర్సులలో యువత రిజిస్ట్రేషన్ చేసుకొవాలి- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలో టాస్క్ కోర్సుల పై అవగాహన కల్పించాలి

2023-2024 & 2024-2025 పాసైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన

టాస్క్ కోర్సుల పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం/ పెద్దపల్లి, సెప్టెంబర్-04:

సెప్టెంబర్ 10 లోపు టాస్క్ కోర్సులలో యువత రిజిస్ట్రేషన్ చేసుకొవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో టాస్క్, జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, వివిధ వృత్తి నేర్పిన కోర్సులు పూర్తి చేసిన వారిలో ప్రస్తుతం 30 శాతం అభ్యర్థులకే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, వీటిని కనీసం 60 నుంచి 65 శాతానికి పెంచడమే లక్ష్యంగా టాస్క్, టీ- హబ్, టీ -వర్క్స్ వంటి వివిధ సంస్థలు పని చేస్తున్నాయని అన్నారు.టాస్క్ , జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో 2023-2024 & 2024-2025 విద్య సంవత్సరంలో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు టెలి పెర్ఫార్మెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కల్పించబడునని,యువతకు ఉపాధి అవకాశాలు లభించేందుకు అవసరమైన సాఫ్ట్ స్కిల్స్, ఇతర నైపుణ్య శిక్షణ 15 రోజుల పాటు అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. శిక్షణ తర్వాత అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని అన్నారు.పెద్దపల్లి ప్రాంతీయ టాస్క్ సెంటర్ నందు గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు వివిధ నైపుణ్య కోర్సులలో ఉచితంగా శిక్షణ అందించడం జరుగుతుందని, సెప్టెంబర్ 10 లోపు ఆసక్తి గల యువత తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.పెద్దపల్లి ప్రాంతీయ టాస్క్ సెంటర్ నందు శిక్షణ పొందిన అనేక మంది అభ్యర్థులకు 3 నుంచి 7 లక్షల రూపాయల ప్యాకేజీ లతో మల్టి నేషనల్ కంపెనీలలో ఉపాధి లభించిందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిగ్రీ తో పాటు సాఫ్ట్ స్కిల్స్, ఇతర శిక్షణ చాలా అవసరమని అన్నారు.ప్రాంతీయ టాస్క్ సెంటర్ నందు అందించే కోర్సులు, నైపుణ్య శిక్షణ గురించి డిగ్రీ, ఇంజనీరింగ్, ఇతర వృత్తిని పుణ్య కళాశాలలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు ‌ఈ సమావేశంలో టాస్క్ ప్రతినిధులు ప్రదీప్ రెడ్డి ప్రోగ్రామ్ మేనేజర్ , సుధీర్ గారు మరియు టెలిపర్ఫోన్స్ కంపెనీ ప్రతినిధులు గీతు చక్రబర్తి వైస్ ప్రెసిడెంట్ , అతుల్ శర్మ – సీనియర్ డైరెక్టర్ , జిల్లా ఉపాధి కల్పన అధికారి తిరుపతి రావు , మేనేజర్ గంగ ప్రసాద్, కౌసల్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

 

 

NAMANI RAKESH
Author: NAMANI RAKESH

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india