– బిజెపి రుద్దూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ
రుద్రూర్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండల కేంద్రంలో నివసిస్తున్న బైండ్ల గంగాధర్ మరియు బుడ్డోళ్ల ఎల్లయ్య అనే ఇద్దరి ఇండ్లు భారీ వర్షాల కారణంగా ధ్వంసమై వర్షపు నీరు ఇంటిలోకి ఉరవడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరుపేద కుటుంబానికి చెందినవారు టార్పాలిన్ పట్టాలు ఇప్పించి సహకరించవలసిందిగా బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణను ఆశ్రయించారు. విషయాన్ని వెంటనే ఆయన బాన్సువాడ బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి బాధితులకు టార్పాలిన్ కవర్లను కొనుగోలు చేసి సోమవారం రోజు వారి ఇంటి వద్దకు వెళ్లి బిజెపి నాయకుల సమక్షంలో వారికి అందజేశారు. మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి సహకరించినందుకుగాను బాధితులు కోనేరు శశాంక్ మరియు ఆలపాటి హరికృష్ణ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, బేగరి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, ఎస్పీ మోర్చా మండల అధ్యక్షులు శివ ప్రసాద్, యువ మోర్చా మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








