– భారీ వర్షం కారణంగా నష్టపోయిన పంటల పరిశీలన
– వివిధ రకాల చీడపీడలు, వ్యాధులపై అవగాహన, పంటల మార్పిడి ఆవశ్యకతపై వివరణ
– సమయానుసారంగా పంటలకు సరైన మోతాదులో ఎరువులను అందించాలని సూచనలు
– మెరుగైన వ్యవసాయ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయని రైతులకు సలహాలు
– వ్యవసాయ శాఖ (ADA) అరుణ
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా : నసురుల్లాబాద్ మండలంలోని లింగంపల్లి తండాలో సోమవారం రోజు వ్యవసాయ శాఖ అధికారిని (ADA) అరుణ భారీ వర్షాల నేపథ్యంలో వరదల కారణంగా ధ్వంసమైన,నష్టపోయిన పంటలను పరిశీలించారు. దీంతోపాటు సక్రమంగా ఉన్న వరి పంట పొలాలను కూడా పరిశీలించి.. వరి పంటకు సోకే వివిధ రకాల చీడపీడలు,వ్యాధుల గురించి రైతులకు అవగాహన కల్పించారు. సమయానుసారంగా పంటలకు సరైన మోతాదులో ఎరువులను అందించాలని రైతులకు పలు సూచనలు చేశారు. తద్వారా పంటలు ఏపుగా పండి మెరుగైన దిగుబడులు సాధించవచ్చు అని సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో( AO) భవాని, (AEO) గోపాల్ , రైతులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








