– బిజెపి నాయకులు..మాజీ ఎంపీ బీబీ పాటిల్
నిజామాబాద్ జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలంలో గల కల్లూర్ , పాత పోతంగల్, సిరిపూర్ ,అంగర్గా గ్రామాలలో భారీ వర్షాల నేపథ్యంలో వరదల కారణంగా పంటలు, ఇండ్లు నష్టపోయిన బాధితులను ఆదివారం రోజు బిజెపి నాయకులు..మాజీ ఎంపీ బీబీ పాటిల్ పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించి పంట పొలాలను, ధ్వంసమైన ఇండ్లను పరిశీలించి, బాధితులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడి త్వరితగతిన పంటల నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని కోరారు. త్వరితగతిన వరద బాధితులకు పంటలకు ఎకరానికి రూ.25000 చొప్పున నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు.. ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, గార్గే శ్రీనివాస్ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పైడిమల్ లక్ష్మీనారాయణ, నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు, అసెంబ్లీ కన్వీనర్ గుడు గుట్ల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, కోటగిరి మండల అధ్యక్షులు నవీన్, పోతంగల్ మండల అధ్యక్షులు, బీర్కూర్ మండల అధ్యక్షులు, వర్ని మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు మార్కెలి ప్రకాష్ పటేల్, కృష్ణంరాజు, సంజు మహారాజ్, గజ్జి పటేల్, విజయ్ పాటిల్ , హరి పటేల్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








