నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాలలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన బాధితులను ఆదివారం రోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు,బాన్సువాడ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మరియు ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావ్ పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించారు. నెమ్లి గ్రామంలో ముంపు బాధితులను పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.3000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా బాధితులకు నష్ట నివారణ చర్యలు త్వరితగతిన చేపట్టాలని మండల తహసిల్దార్ కు చరవాణి ద్వారా మాట్లాడి డిమాండ్ చేశారు. అనంతరం నాచుపల్లి గ్రామంలో భారీ వర్షాల నేపథ్యంలో కూలిపోయిన ఇండ్ల బాధితులను పరామర్శించి ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున నాలుగు కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో మొత్తం 30 కుటుంబాలకు రూ. 3000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. బాధితులను ఓదార్చి ప్రభుత్వంతో కొట్లాడి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని భరోసా అందించారు. అనంతరం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గత కొద్ది రోజుల క్రితం మృతిచెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మేదరి రాములు కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని అందించారు. రూ .5000 ఆర్థిక సహాయాన్ని అందజేసి.. భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు, అల్లం రాములు, గంపల శంకర్, దత్తు, లక్ష్మణ్, భూమయ్య, రాజు, రమేష్, షఫీ, గంగాధర్, డి. సాయిలు, అంబర్ సింగ్, ఎజాస్, మాధవరెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








