Post Views: 446
వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ శ్రేణులకు సహాయక చర్యలపై సూచనలు…
“ప్రజల సమస్యలు నా దృష్టికి తీసుకురండి” – మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమిర్ ఆదేశం..
బోధన్, ఆగస్టు 30:
భారీ వర్షాల కారణంగా బోధన్ నియోజకవర్గంలోని పలు మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడం, నివాసాలు, పంట పొలాలు నీట మునగడం, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడం పట్ల మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమిర్ ఆందోళన వ్యక్తం చేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో ఫోన్ ద్వారా మాట్లాడిన ఆయన, పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. మండల, పట్టణ అధ్యక్షులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
“ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే నా దృష్టికి తీసుకురావాలి. వరద బాధితులకు అందుబాటులో ఉండేలా అన్ని పార్టీ నాయకులు కృషి చేయాలి” అని షకీల్ ఆమిర్ పేర్కొన్నారు.
పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ, అవసరమైన చోట సహాయక చర్యలను వేగవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సూచించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








