V1News Telangana

best news portal development company in india

వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు….

SHARE:

 

– నీట మునిగిన పంట పొలాలు పరిశీలన రైతులకు అండగా ఉంటామని భరోసా

– శిథిలావస్థలో ఉన్న, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల బాధితులకు పరామర్శ

– బాధితులకు ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని.. తహసిల్దార్ కు వినతిపత్రం అందజేత

– బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు

నసురుల్లాబాద్ ప్రతినిధి:

నసురుల్లాబాద్(29) V1 న్యూస్: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్ ఆధ్వర్యంలో, టేకుర్ల సాయిలు ఆధ్వర్యంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితుల సమస్యల పరిష్కారం కొరకు శుక్రవారం రోజు మండల కేంద్రంలో డిప్యూటీ ఎమ్మార్వో ను కలిసి వినతి పత్రం అందించారు.మండల పరిధిలో ఉన్న గ్రామాలలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న ఇండ్లు మరియు పంట నష్టం రోడ్లు, డ్రైనేజీ కాలువలు, రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసి నష్టాలను నివేదికలు జరిపించి త్వరితగతిన పూర్తిచేయాలని బిఆర్ఎస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేశారు. మండలంలోని గ్రామాలలో భారీ వర్షంతో ఇండ్లు కూలిపోయిన బాధితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల పరిధిలో ఉన్న గ్రామాల్లో పంట నష్టం కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.25000 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కోరారు. గ్రామాలలో రోడ్లు మరియు డ్రైనేజీలు అకాల వర్షానికి కొట్టుక పోయిన త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకట్ సార్, మోసీన్, మంగలి సాయికుమార్, గంపల శంకర్, మామిడి భూమయ్య, అల్లం రాములు, పెర్క కృష్ణ, కనుకుంట్ల శ్రీను, కుమార్, తర్ణం పోచయ్య, డి.సాయిలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india