Post Views: 98
రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో గోదావరి తీర ప్రాంతంలో మునిగిన పంటలను పరిశీలించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి (MPR) మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంజీరా–గోదావరి తీర ప్రాంతాలు నీటమునిగిపోయి, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు.
రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ప్రభావిత రైతులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, రెంజల్ మండల అధ్యక్షులు యోగేష్, సీనియర్ నాయకులు మేక సంతోష్, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జి శ్రీధర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








