Post Views: 69
ఖజాపూర్, మందర్న, హున్సా గ్రామాలపై వరద ఉధృతి..
రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో జనజీవనం స్తంభనం..
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న రెస్క్యూ బృందాలు…
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
బోధన్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంజీరా పరివాహక ప్రాంతమైన సాలూర మండలంలోని ఖజాపూర్, మందర్న, హున్సా గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండటంతో గ్రామాలను వరద నీరు చుట్టుముట్టేసి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్న పరిస్థితిలో పోలీసులు మరియు అధికారులు పునరావాస చర్యలు ప్రారంభించారు. రవాణా సదుపాయాలు లేకపోవడంతో ప్రజలను ట్రాక్టర్ల సాయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఇబ్బందులు మరింతగా పెరిగాయి.
సహాయక చర్యల్లో ఎస్ఐ మచ్చెందర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన నిన్నటినుంచి ఇప్పటివరకు కంటి మీద కునుకు లేకుండా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులను ప్రాణాలకు తెగించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎస్ఐతో పాటు ప్రత్యేక రెస్క్యూ బృందాలు కూడా క్షేత్రస్థాయిలో నిరంతరం కృషి చేస్తున్నాయి.
స్థానిక ప్రజలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు ఎస్ఐ మచ్చెందర్ రెడ్డి మరియు సహాయక బృందాలకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు వరద నీరు తగ్గిన తర్వాతే పూర్తి సహాయక చర్యలు చేపట్టడం సాధ్యమవుతుందని వెల్లడించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








