Post Views: 150
భారీ వర్షాలు… నర్సాపూర్ ఇళ్లు శిథిలావస్థ – రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్ సహాయం
బోధన్: భారీ వర్షాల కారణంగా బోధన్ పట్టణం మరియు పరిసర ప్రాంతాలు అస్తవ్యస్థంగా మారాయి. ముఖ్యంగా నర్సాపూర్ గ్రామంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ఇళ్లు శిథిలావస్థకు చేరాయి.
ఈ పరిస్థితిని గమనించిన రెడ్ క్రాస్ సొసైటీ మరియు లయన్స్ క్లబ్ ప్రతినిధులు ముందుకొచ్చి సహాయక చర్యలు చేపట్టారు. పది ఇళ్లపై తాత్కాలిక రక్షణ కోసం పట్టాలు కప్పారు.
రెడ్ క్రాస్ సొసైటీ బోధన్ డివిజన్ అధ్యక్షుడు భశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ, “నర్సాపూర్ ప్రజలు భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యుల కోసం పదేళ్ల పాటు ఉపయోగపడే తైవాన్ పట్టాలను పంపిణీ చేశాం” అన్నారు.
ఈ కార్యక్రమంలో బోధన్ టౌన్ మరియు మండల రెడ్ క్రాస్ అధ్యక్షులు కొడాలి కిషోర్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు నాగేశ్వరరావు, స్థానిక నాయకులు సాయికృష్ణతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ కూడా పట్టణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








