V1News Telangana

best news portal development company in india

అమ్ధాపూర్ చెరువు కట్ట భద్రతపై ఇరిగేషన్ శాఖ అప్రమత్తం – బీజేపీ నాయకుల విజ్ఞప్తి

SHARE:

బోధన్ మండలం అమ్ధాపూర్ గ్రామంలో భారీ వర్షాల ప్రభావంతో చెరువులు నిండిపోవడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలో అమ్ధాపూర్ చెరువు నీరు అలుగు పారుతుండగా పక్క ప్రాంతాల్లో కూడా నీరు అధికంగా చేరుతున్నందున ప్రమాదం తలెత్తే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
విషయం తెలిసిన వెంటనే ఇరిగేషన్ AE శ్రీనివాస్ గారు సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా బోధన్ మండల బీజేపీ అధ్యక్షులు సిర్ప సుదర్శన్ గారు, రైతులు AE గారిని కలిసి చెరువు కట్టకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని, అలాగే బెల్లల్ చెరువు బ్యాక్‌వాటర్ వలన అమ్ధాపూర్ శివారులోని పంట పొలాలు మునిగిపోతున్నందున వీలైనంత త్వరగా బెల్లల్ చెరువు నీటిని కిందకి విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యపై AE శ్రీనివాస్ వెంటనే స్పందించి సిబ్బందికి తగిన సూచనలు చేస్తూ, చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించమని ఆదేశించారు. వెంటనే చర్యలు తీసుకున్న ఇరిగేషన్ అధికారులకు, సిబ్బందికి స్థానికులు మరియు రైతులు కృతజ్ఞతలు తెలిపారు
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india