V1News Telangana

best news portal development company in india

మంజీరా ఉగ్రరూపం – వరదలు సాలూరలో! . నిజామసాగర్‌లో 24 గేట్లు ఎత్తివేత – మంజీరా పరివాహక గ్రామాలకు అలర్ట్! . భారీ వర్షాలు, ముంపు భయం – తహసిల్దార్ ప్రజలకు హెచ్చరిక…

SHARE:

మంజీరా ఉగ్రరూపం –  వరదలు సాలూరలో!
. నిజామసాగర్‌లో 24 గేట్లు ఎత్తివేత – మంజీరా పరివాహక గ్రామాలకు అలర్ట్!
. భారీ వర్షాలు, ముంపు భయం – తహసిల్దార్ ప్రజలకు హెచ్చరిక
✔ నిజామసాగర్ నీటి మట్టం 1404.14 అడుగులకు చేరువ
✔ మొత్తం అవుట్‌ఫ్లో 1,99,244 క్యూసెక్కులు
✔ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి..
oplus_0
సాలూర, ఆగస్టు 28:తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా వరద నీరు ముంచెత్తి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. మంజీరా నది ఉధృతంగా పొంగిపొర్లుతూ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలను ముంచెత్తుతోంది.
నిజామసాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయికి చేరువ కావడంతో అధికారులు 24 గేట్లు ఎత్తివేశారు.
ప్రాజెక్ట్ తాజా వివరాలు (ఉ. 8 గంటలకు):
నీటి మట్టం: 1404.14 అడుగులు (పూర్తి స్థాయి – 1405.00 అడుగులు)
నిల్వ సామర్థ్యం: 16.559 టీఎంసీలు (పూర్తి సామర్థ్యం – 17.802 టీఎంసీలు)
ఇన్‌ఫ్లో: 2,23,336 క్యూసెక్కులు
గేట్ల ద్వారా విడుదల: 1,99,244 క్యూసెక్కులు
ఓపెన్ చేసిన గేట్ల సంఖ్య: 24
ప్రధాన కాల్వ, ఎస్కేప్ రెగ్యులేటర్: మూసివేసినవే
ఇంత భారీగా నీటి ప్రవాహం రావడంతో మంజీరా పరివాహక ప్రాంతాల్లోని మందర్న, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గేల్లీ గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయి. పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి.

వాతావరణ శాఖ హెచ్చరిక:

రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తహసిల్దార్ హెచ్చరిక:

సాలూర మండల తహసిల్దార్ వై.శశిభూషణ్ మాట్లాడుతూ –

“మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరూ మంజీరా పరివాహక ప్రాంతాలు, వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లవద్దు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దు. గర్భిణీ స్త్రీలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే 104 లేదా 108కు కాల్ చేయాలి” అని విజ్ఞప్తి చేశారు.

అత్యవసర నెంబర్లు:

మండల తహసిల్దార్: 9491038550
మండల ప్రజా పరిషత్ అధికారి: 9849432566
బోధన్ రూరల్ ఎస్సై: 8712659872

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india