V1News Telangana

best news portal development company in india

జంగంపల్లి వద్ద వరద నీరు ఉధృతి – జాతీయ రహదారి 44పై రాకపోకలు నిలిచిపోయి పునరుద్ధరణ పోలీసుల చురుకైన చర్యలకు ప్రజల ప్రశంసలు..

SHARE:

నిజామాబాద్, ఆగస్టు 27:
కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి 44 పై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. తక్కువ సమయంలోనే రహదారిపై నిలిచిపోయిన నీటిని తగ్గించి, రాకపోకలను పునరుద్ధరించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ మాట్లాడుతూ, “వాహనదారులు కాస్త సమయమానం పాటించి సహకరించినందుకు కృతజ్ఞతలు” అని తెలిపారు. వర్షాన్ని లెక్క చేయకుండా రాత్రింబవళ్ళు కృషి చేసి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేగంగా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు.
సామాన్య ప్రజలు మరియు వాహనదారులు పోలీసుల వేగవంతమైన చర్యలను కొనియాడారు. “పోలీసులు సమయానికి స్పందించకపోయుంటే, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది” అని వారు అభిప్రాయపడ్డారు.
ఈ చర్యల్లో కమిషనర్‌తో పాటు కామారెడ్డి ఎస్పీ ఎమ్. రాజేష్ చంద్ర, ఐపీఎస్, నిజామాబాద్ అదనపు డిసిపి (అడ్మిన్) బస్వా రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india