– మెడి కవర్ హాస్పిటల్ సిబ్బంది పర్యవేక్షణలో పలు రకాల వ్యాధులకు వైద్య చికిత్సలు
– బిపి, షుగర్, ఈసిజి , రాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్, ఆక్సిజన్ లెవెల్స్, పల్స్ రేట్ వివిధ వైద్య పరీక్షలు
– అధిక సంఖ్యలో హాజరైన ప్రజలు, ఉచితంగా మందుల పంపిణీ
– కోనేరు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బిజెపి నాయకులు,NRI కోనేరు శశాంక్
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం,నసురుల్లాబాద్ మండలంలోని సంగం గ్రామంలో సోమవారం రోజు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బాన్సువాడ బిజెపి నాయకులు NRI కోనేరు శశాంక్ సహకారంతో మెడి కవర్ హాస్పిటల్ , నిజామాబాద్ వారి పర్యవేక్షణలో ఉచిత “మెగా హెల్త్ క్యాంప్” ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు హాజరై, మాజీ ఎంపీపీ పాల్త్య విటల్ తో కలిసి రిబ్బన్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వృద్ధులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడి కవర్ హాస్పిటల్ సిబ్బంది వివిధ రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు, వృద్ధులకు బిపి, షుగర్, ఈసిజి, రాండమ్ బ్లడ్ షుగర్, ఆక్సిజన్ లెవెల్స్, పల్స్ రేట్, వంటి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సున్నం సాయిలు మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు అందించడమే కోనేరు చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యం అని పేర్కొన్నారు. అదేవిధంగా బిజెపి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పోస్టల్ బీమా పథకం, స్కూల్ పిల్లలకు బ్యాగుల పంపిణీ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి చదువుల కొరకు తన వంతు ఆర్థిక సహాయాలు అందిస్తూ ఆదుకుంటున్నారని కొనియాడారు. భగవంతుడి ఆశీస్సులతో కోనేరు శశాంక్ భవిష్యత్తులో పేద ప్రజల అభ్యున్నతికి మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు అనుసూరి శ్రీనివాస్, గొడిసెల యాదగిరి గౌడ్, అరిగె నారాయణ, పెరిక రాములు, వినోద్, జ్ఞానేశ్వర్, కొప్పుల సాయిలు, ఉల్లెంగ గోపి, ఉల్లెంగ పర్వయ్య, ర్యాపని మహేష్, తాటికోల్ శేఖర్, కిష్టయ్య, సాయిలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








