– మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ నిర్వహణ
– పర్యావరణ పరిరక్షణలో భాగంగా “గ్రీన్ ఇండియా చాలెంజ్” నినాదంతో అమలు
– ప్రజలందరూ సంకల్పంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి
– బిఆర్ఎస్ నాయకులు
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం రోజు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ నిర్వహించే బృహత్తర కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు కృషి చేస్తూ “గ్రీన్ ఇండియా చాలెంజ్”లో భాగంగా “హరితసేన విత్తన గణపతి” ప్రతిమలను మండల కేంద్రంలో ఉప తహసిల్దార్ బావయ్య , ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్ , సీఐ తిరుపతయ్య, ఎస్సై రాఘవేంద్ర లకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణం కలుషితం చెందడం వలన ఎదురయ్యే దుష్ప్రభావాలను ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా రసాయనాలతో కూడిన వినాయకుడి ప్రతిమలను కాకుండా ప్రకృతి లో లభించే సహజ సిద్ధమైన వాటితో తయారుచేసిన ప్రతిమలను ప్రతిష్టించి పూజించుకొని నిమజ్జనం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వెంకటేష్, బిఆర్ఎస్ మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు, వెంకటి సార్, మంగలి సాయికుమార్, మోసీన్, అల్లం రాములు, రాజు నాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








