V1News Telangana

best news portal development company in india

ఖాజాపూర్‌లో వరదలో మునిగిన సోయాబీన్ పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

SHARE:

సాలూర:ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీటిలో మునిగిన సోయాబీన్ పంటలను బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఖాజాపూర్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులను పరామర్శించారు.
మండల తహసిల్దార్ శశిభూషణ్, వ్యవసాయ అధికారి శ్వేతతో కలిసి నష్టాన్ని అంచనా వేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, దాదాపు 250 ఎకరాల సోయా పంట వరదకు గురై నష్టపోయినట్లు అధికారులు స్పష్టం చేశారని తెలిపారు. నష్టపరిహారం కోసం నివేదికలు సిద్ధం చేసి డివిజన్, జిల్లా అధికారులకు సమర్పిస్తామని హామీ ఇచ్చారు.
రైతులు ధైర్యంగా ఉండాలని కోరిన ఆయన, “ప్రభుత్వం నుంచి సహాయం అందేలా కృషి చేస్తాం. పంట నష్టపరిహారం తప్పకుండా అందిస్తాం” అని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో TPCC డెలిగేట్ గంగా శంకర్, బోధన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేశ్వర్ రావు, AMC ఛైర్మన్ చీల శంకర్, సొసైటీ ఛైర్మన్ అల్లే జనార్ధన్, సాలూర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మందర్న రవి, చిద్రపు అశోక్, AMC డైరెక్టర్ బాలకృష్ణ రెడ్డి, NSUI అధ్యక్షుడు అనిల్‌తో పాటు స్థానిక రైతులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india