Post Views: 96
సాలూర: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశుభ్రంగా, నాణ్యతతో అందించాలని అధికారులు సూచించారు. సోమవారం మండల ఎంపీడీవో శ్రీనివాస్, తహసిల్దార్ శశిభూషణ్, మండల విద్యాశాఖ అధికారి రాజీ మంజుష కలిసి పాఠశాల వంటశాలలను పరిశీలించారు.
అధికారులు వంటశాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు సమయానికి భోజనం అందించాలన్నారు. కొత్త బియ్యం అందుతున్నందున భోజనం మెత్తగా అవుతుందని నిర్వాహకులు తెలిపారు. అయితే గత ఎనిమిది నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని సకాలంలో చెల్లించాలంటూ అధికారులు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








