Post Views: 247
ప్రభుత్వ పాఠశాలల్లో టీఎల్ఎం మేళా.. విద్యార్థుల అభ్యాసానికి కొత్త దారి
. సాలూరలో బోధనోపకరణాల మేళా.. ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రశంసలు
. విద్యార్థుల కోసం టీఎల్ఎం మేళా.. ఉత్తమ ప్రదర్శనకు జిల్లా స్థాయి అవకాశం
సాలూరలో ఎడ్యుకేషన్ ఎగ్జిబిషన్.. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌తో బోధన సులభం
సాలూరలో టీఎల్ఎం మేళా ప్రారంభం
బోధన్ : టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) బోధనోపకరణాల మేళా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించడం అభినందనీయమని మండల ఎంపీడీవో శ్రీనివాస్, తహసిల్దార్ శశిభూషణ్ అభిప్రాయపడ్డారు. సాలూర మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటుచేసిన టీఎల్ఎం మేళాను మండల విద్యాశాఖ అధికారి రాజీ మంజూషతో కలిసి వారు ప్రారంభించారు.
తెలుగు, గణితం, ఇంగ్లీష్, ఈవీఎస్ సబ్జెక్టులపై ఉపాధ్యాయులు తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా ఈ బోధనోపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎంఈఓ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ ప్రదర్శన చేసిన 10 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి జిల్లా స్థాయి మేళాకు పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రైమరీ పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటరత్నం, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








