Post Views: 176
ట్రాఫిక్ జామ్‌లకు బ్రేక్ – ఖలీల్వాడిలో వన్‌వే విధానం ప్రారంభం
వాహనదారుల ఇబ్బందులకు పరిష్కారం – ఖలీల్వాడిలో వన్‌వే రూట్…
కమీషనర్ ఆదేశాలతో కొత్త ట్రాఫిక్ నియమాలు – ఖలీల్వాడిలో వన్‌వే.
ఖలీల్వాడి ట్రాఫిక్ కష్టాలపై పోలీసుల యాక్షన్ – వన్‌వే ప్రారంభం
నిజామాబాద్, ఆగస్టు 24:
నగరంలోని ఖలీల్వాడి ప్రాంతంలో వాహనదారులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆధ్వర్యంలో IMA అసోసియేషన్, మున్సిపల్ అధికారులు, DM&HOతో జరిగిన సమీక్షా సమావేశంలో ఖలీల్వాడిలో వన్‌వే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.కమిషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ పర్యవేక్షణలో, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ మరియు సిబ్బంది కొత్త వన్‌వే మార్గాలను అమలు చేశారు.BSNL సర్కిల్ వద్ద ఎంట్రీ: వాహనదారులు ఈ మార్గం ద్వారా ఖలీల్వాడిలోకి వెళ్లవచ్చు.
ఎగ్జిట్ పాయింట్లు: గ్రంధాలయం ముందు, వెల్నెస్ హాస్పిటల్ పక్కన, నలంద కాలేజీ ముందు, అమృత లక్ష్మి స్కాన్ సమీప గల్లీ, సన్‌రైస్ హాస్పిటల్ గల్లీ మరియు వెల్నెస్ హాస్పిటల్ నుండి అనుపమ హాస్పిటల్ వైపు దారుల ద్వారా బయటకు వెళ్ళవచ్చు.
అదనంగా, వాహనదారులకు సులభతరం చేయడానికి వన్‌వే రూట్ మ్యాప్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నిబంధనలను పాటించి ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








