V1News Telangana

best news portal development company in india

లక్ష్మాపూర్ వాగులో విచ్చలవిడిగా ఇసుక దోపిడి.. రెచ్చిపోతున్న ఇసుక మాఫియా… అధికారులపై సైతం దాడులు! పగలు-రాత్రి తేడా లేకుండా ఇసుక త్రవ్వకాలు – రైతుల ఆవేదన . చందూరులో వాగుల దోపిడి.. వాల్టా చట్టానికి తూట్లు లక్ష్మాపూర్‌లో ఇసుక మాఫియా రౌడీయిజం.. ప్రజల ఫిర్యాదులు వృథా

SHARE:

చందూరు, ఆగస్టు 24:
నిజామాబాద్ జిల్లా చందూరు మండలంలోని లక్ష్మాపూర్ గ్రామ సమీపంలో ఉన్న వాగులో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. పగలు-రాత్రి అనే తేడా లేకుండా జేసీబీల సాయంతో భారీ ఎత్తున ఇసుక త్రవ్వకాలు కొనసాగుతున్నాయి. తవ్విన ఇసుకను బిల్లులు లేకుండా ₹3,500 నుంచి ₹5,000 వరకు అమ్మకాలు జరుపుతూ అక్రమంగా లాభాలు ఆర్జిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
“చెప్పినా వినడం లేదు.. ఎదురుచెప్పితే రౌడీయిజం చేస్తున్నారు” అని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియాలు వాగుతో పాటు సమీపంలోని వ్యవసాయ భూములలో కూడా తవ్వకాలు జరిపి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే “ఎమ్మార్వో చెప్పాలి” అంటూ తప్పించుకుంటున్నారని, రెవెన్యూ అధికారులపై దాడులకు దిగుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. “ఇసుకపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం.. కానీ సిబ్బంది తక్కువగా ఉంది. పోలీసు సహకారం తీసుకుంటాం” అని ఆరై సారు ఫోన్‌లో సమాధానం ఇచ్చారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india