– రుద్రూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ పారదర్శకంగా, నిజమైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్
– గ్రామంలో మురికి కాలువలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచనలు
– బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే దారిలో నూతన వంతెన నిర్మాణ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని తహసిల్దార్ కు విజ్ఞప్తి
– రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ
రుద్రూర్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి శనివారం రోజు భారతీయ జనతా పార్టీ రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, నాయకులు NRI కోనేరు శశాంక్ తదితరులు అందరూ తహసిల్దార్ ను కలిసి వినతి పత్రం అందించారు. రుద్రూర్ గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మరియు ప్రస్తుత ప్రభుత్వం నిర్మాణం చేపడుతున్న రెండు పడకగదుల ఇండ్లను నిరుపేదలు ,ఇండ్లు లేని , నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా గ్రామంలో గల మురికి కాలువలు కబ్జాకు గురైనందున వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తహసిల్దార్ ప్రత్యేక చొరవ తీసుకొని వారం రోజుల వ్యవధిలో రుద్రూర్ గ్రామపంచాయతీ వద్ద గ్రామసభను ఏర్పాటు చేసి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని .. ఆ సమస్యల పరిష్కారానికి పై అధికారులకు నివేదిక పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు, ప్రలోభాలకు గురికాకుండా గ్రామ సభను ఏర్పాటు చేసి అందరి సమక్షంలో బహిరంగంగా, పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రుద్రూర్ మండల బిజెపి కమిటీ తరపున కోరారు. దీంతో పాటు రుద్రూర్ నుండి బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే దారిలో అధిక వర్షం కారణంగా ప్రతిసారి చెరువు అలుగు పారడం వలన గ్రామ ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఈ సమస్యను సంబంధిత అధికారుల సమన్వయంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నూతన వంతెన నిర్మాణం చేపట్టే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రశాంత్ గౌడ్, బిజెపి నాయకులు NRI కోనేరు శశాంక్, సీనియర్ నాయకులు మార్కెలి ప్రకాష్ పటేల్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, కోశాధికారి కటికె రామ్ రాజ్, సీనియర్ నాయకులు పార్వతి మురళి, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








