Post Views: 50
*అనర్హులకు సదరం – కాసులిస్తే వైకల్యం డోస్ పెంచేస్తున్నారు*
*అనర్హులకు పింఛన్ల కోసం రూ.50 వేల వరకూ వసూలు – తాజాగా నోటీసులు అందిన వారితోనూ బేరసారాలు*
దివ్యాంగులు, అనారోగ్య పింఛన్లు పొందుతున్న అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన తనిఖీలకు కొంతమంది క్షేత్రస్థాయి సిబ్బంది తూట్లుపొడుస్తున్నారు. పకడ్బందీగా చేపట్టాలని నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినా వాటిని బేఖాతరు చేస్తున్నారు. అనర్హులను గుర్తించేందుకు 8 నెలలుగా తనిఖీలు జరుగుతున్నాయి. ఇందులో అనర్హులుగా గుర్తించిన వారి నుంచి రూ.50 వేల వరకు తీసుకొని తప్పుడు సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు.
కొన్ని చోట్ల ఆసుపత్రుల్లోని సిబ్బంది నేరుగా అనర్హులకు ఫోన్లు చేసి బేరాలు పెడుతుండగా మరికొన్ని చోట్ల దళారులు చక్రం తిప్పుతున్నారు. అప్పట్లో అనర్హులకు పింఛన్లు దక్కడంలో ఎక్కువగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలలపాటు సాగే తనిఖీల్లో ప్రభుత్వం ఈ ధోరణికి అడ్డుకట్ట వేయకుంటే మళ్లీ అనర్హులు పెద్ద సంఖ్యలో పింఛన్లు పొందే అవకాశముంది.
నోటీసులు తీసుకున్న వారి నుంచీ వసూళ్లే : అనర్హులుగా తేలి నోటీసులు అందిన వారినీ వదలడం లేదు. అనంతపురానికి చెందిన ఓ వ్యక్తికి 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నట్లు గుర్తించి పింఛన్ తొలగిస్తూ నోటీసు జారీ చేస్తే రూ.50 వేలు ఇస్తే 70 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువపత్రం ఇస్తామని చెప్పి బేరంపెట్టారు. వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండలంలోనూ నోటీసులు జారీ అయిన అనర్హుల వద్దకు దళారులు వెళ్లి రూ.30 వేలు ఇస్తే పింఛన్లను పునరుద్ధరిస్తామని చెప్పి ఒప్పందాలు చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో కొంతమంది అనర్హులకు పింఛన్లు తొలగించకుండా చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








