Post Views: 75
ఉపశీర్షిక:
బెంగళూరు ఎఫ్‌ఐఆర్, బ్యాంక్ ఖాతా, బంగారు నగల పేరుతో రెండు రోజులలోనే భారీ మోసం – పరిస్థితి అర్థమైంది వెంటనే ఫిర్యాదు చేసి కూల్చుకున్నాడు.
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు డిజిటల్ అరెస్టు పేరిట మోసానికి గురయ్యాడు. జూన్ 17న వచ్చిన ఫోన్ కాల్‌లో, ఎయిర్‌టెల్ నుండి వచ్చినట్లు చెప్పి, బెంగళూరులో నేరానికి సంబంధించిన FIR నమోదైనట్లు తెలిపారు. తరువాత వీడియోకాల్‌లో “బెంగళూరులోని ఎస్సై” వేషధారణలో తనను మోసగాళ్లు పరిచయం చేశారు.మోసగాళ్లు సీబీఐ అధికారులు, బ్యాంక్ ఇన్‌స్పెక్టర్ వేషంలో బాధితుడిని బలవంతం చేసి, ఇంట్లోని బంగారు నగలు తాకట్టు పెట్టించి, బ్యాంక్ ద్వారా రూ.18.50 లక్షలను తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. మరోసారి డబ్బు అడిగిన మోసానికి అనుమానం ఏర్పడడంతో బాధితుడు పోలీసులు ఆశ్రయించారు.
సైబర్ నేరాలపై కీలక పాఠం:
పోలీసుల ప్రకారం, మోసానికి గురైన వెంటనే ఫిర్యాదు (గోల్డెన్ అవర్‌లో) చేయడం అత్యంత కీలకం. రాష్ట్రంలో గత రెండు సంవత్సరాల్లో 11.97 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. సైబర్ నేరం జరిగిన తొలి గంటలో ఫిర్యాదు చేసినవారికి రూ.274 కోట్లు రికవరీ అవ్వడం సాధ్యమైంది.
ఫిర్యాదు విధానం:
టోల్‌ఫ్రీ నంబర్ 1930
https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు
స్థానిక పోలీస్‌స్టేషన్ ద్వారా కూడా నమోదు..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








