V1News Telangana

best news portal development company in india

నిజామాబాద్‌లో PSOల శిక్షణా శిబిరం ప్రారంభం….

SHARE:

 PSOలకు ఆధునిక శిక్షణపై కమిషనర్ సాయి చైతన్య..

VIP భద్రతలో PSOల కీలక పాత్ర – కమిషనర్….

 PSOల నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక శిక్షణా శిబిరం…

నిజామాబాద్, ఆగస్టు 22:
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ల (PSO) శిక్షణా కార్యక్రమం ఈ రోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ హల్‌లో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, VIP భద్రతలో PSOల పాత్ర అత్యంత కీలకమని, నైపుణ్యాభివృద్ధి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలు వంటి అంశాల్లో అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ఉద్దేశమని తెలిపారు. రెండు రోజుల శిక్షణ ద్వారా PSOలు మరింత సమర్థంగా తమ బాధ్యతలు నిర్వర్తించగలరని అన్నారు.కార్యక్రమంలో అదనపు డీసీపీ ఏ ఆర్ శ్రీ ఏ. రామచంద్ర రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, శ్రీ తిరుపతి, శ్రీ సతీష్, శ్రీ శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india