Post Views: 67
సలాంపాడ్, మందర్ణ గ్రామాల్లో అంగన్వాడి భవనాలు – ఇంకుడు గుంతల భూమిపూజ
సాలురా మండలం, ఆగస్టు 22:
ప్రజా ప్రభుత్వ “పనుల జాతర” కార్యక్రమం లో భాగంగా శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సాలురా మండలంలోని సలాంపాడ్ మరియు మందర్ణ గ్రామాల్లో నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ (మార్కౌట్) కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
అలాగే మందర్ణ మరియు సలాంపాడ్ క్యాంప్ గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇండ్ల వద్ద మేజిక్ సోకఫిట్ (ఇంకుడు గుంత) భూమిపూజ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్ చీల శంకర్, సాలురా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందర్ణ రవి, AMC డైరెక్టర్ బాలకృష్ణ, MPDO శ్రీనివాస్, AE శివా, స్పెషల్ ఆఫీసర్ రాథోడ్ రాధిక, NSUI అధ్యక్షుడు అనిల్, సలాంపాడ్ సొసైటీ ఛైర్మన్ బ్రహ్మరెడ్డి, మాజీ చైర్మన్లు వెంకటేశ్వరరెడ్డి, నరసింహారెడ్డి, పద్మారెడ్డి, సంతోష్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు హరిత, రఘుపతి రెడ్డి, గంగారం, సాయిలు, ప్రహ్లాద్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని నాయకులు తెలిపారు..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








