Post Views: 109
నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నాయకులు మండల రెవెన్యూ అధికారి (MRO) కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు చందూరి హన్మాండ్లు మాట్లాడుతూ మండలంలో అనేక సమస్యలు పరిష్కారం కావలసి ఉందని పేర్కొన్నారు.
మండల కేంద్రంలో గ్రంథాలయం ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం, పశువైద్యశాల, గ్రామపంచాయతీ భవనాలు శిథిలావస్థలో ఉండి కొత్తగా నిర్మించకపోవడం, అలాగే ప్రస్తుతం ఉన్న బస్టాండ్లో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి అని తెలిపారు.
అదేవిధంగా నసురుల్లాబాద్-బైరాపూర్, దుర్కి-మిరజాపూర్, నేమలి-బొమ్మందేవ్ పల్లి రహదారులు ఇరుకుగా ఉండడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి రహదారులను వెడల్పు చేసి ప్రమాదాలను నివారించాలని డిమాండ్ చేశారు.
అంతేకాక నచుపల్లి రామాలయం, దుర్కి సోమలింగేశ్వర ఆలయం, శ్రీ రాజరాజేశ్వర ఆలయం, కొచ్చర మైసమ్మ ఆలయాల భూములను పాత రికార్డుల ప్రకారం సర్వే చేయించి సరిహద్దులు ఏర్పాటు చేయాలి. ఆలయ భూములపై బోర్డులు ఏర్పాటు చేసి, భూములు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సతీష్, మండల ప్రధాన కార్యదర్శి అక్కం లక్ష్మణ్, ఉపాధ్యక్షులు శేఖర్, దళిత మోర్చా మండల అధ్యక్షులు కరోళ్ల గంగాధర్, పవన్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








