Post Views: 95
జిల్లా నిజామాబాద్ బోధన్ మండలంలోని ఉట్పల్లి ప్రాథమిక పాఠశాల తెలుగు మీడియం పాఠశాలలో తీవ్ర నిర్లక్ష్య పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు భోజనం వండే మధ్యాహ్న భోజన గది వద్ద అనుచిత కార్యకలాపాలు జరుగుతున్నాయి. గ్రామంలోని కొందరు వ్యక్తులు ఆ ప్రాంతంలో మలవిసర్జన చేయడం వల్ల అసహ్యకర దృశ్యాలు ఏర్పడుతున్నాయి. గత నెల రోజులుగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ పాఠశాల సిబ్బంది, గ్రామ పెద్దలు పలు సార్లు సమావేశాలు నిర్వహించినా మార్పు కనిపించలేదు.పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ –“ఇది మీ పాఠశాల, మన గ్రామ పాఠశాల. దీన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. అనవసరంగా పాఠశాల ఆస్తులు ధ్వంసం చేయడం, తాళాలు పగలగొట్టడం, తరగతి గది తలుపులు బైక్‌తో ఢీకొట్టి విరగగొట్టడం వంటి ఘటనలు కూడా పలుమార్లు జరిగాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువ సంఘాలు ఈ చర్యలు పునరావృతం కాకుండా సహకరించాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








