Post Views: 150
మంజీరా తీరాలు మాఫియా అడ్డా.. అధికారులు ఎక్కడ?
. ప్రజల ప్రశ్న.. ఇసుక దందాపై ఎవరి చెవిలోనూ వినపడట్లేదా?
ప్రభుత్వ ఆదాయం దోపిడీ.. అధికారుల మౌనం ఎందుకు?
. సిఎం ఆదేశాలు గాలికా?.. అక్రమార్కుల జాతర కొనసాగుతోందా..
నిజామాబాద్ ప్రతినిధి:
జిల్లాలో అక్రమ ఇసుక రవాణా దందా రోజురోజుకూ పెరిగిపోతున్నా, పై అధికారులు మాత్రం కళ్ళు మూసుకుని కూర్చున్నారా.? అని ప్రజలు మండిపడుతున్నారు. అర్థరాత్రి సమయాల్లోనే ట్రాక్టర్లు, లారీలతో ఇసుక స్మగ్లింగ్ దందా ఊపందుకుంటోందని ఉమ్మడి మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు.?

అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్న ఈ అక్రమ రవాణా ఎందుకు ఆగడం లేదో ప్రజలకు అర్థం కావడం లేదు.


ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీస్, టాస్క్ ఫోర్స్ శాఖల నిర్లక్ష్యం పలు అనుమానాలకు తావిస్తోంది. మంజీరా పరివాహక ప్రాంతాలు అక్రమ ఇసుక మాఫియాల అడ్డాగా మారిపోయినా చర్యలు కనిపించడం లేదు.
“అసలు అధికారులకు తెలియకుండా ఒక్క ట్రాక్టర్ కూడా కదలదు. అయితే ఎందుకు నిర్లక్ష్యం?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


సిఎం ఆదేశాలు గాలికొదిలి మాఫియాలను కాపాడుతున్నారా.? లేదా వెంటనే కఠిన చర్యలు తీసుకుంటారా? అన్నది ఇప్పుడు అందరి దృష్టి సారించిన ప్రశ్నగా మారింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








