Post Views: 181
బోధన్ టౌన్, ఆగస్టు 19, V1 బోధన్ పట్టణంలో సిపిఎం మంగళవారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది .ఈ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు హాజరై మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని అందులో భాగంగానే బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని నడిపించటంలో రెండు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతోటే అది మూలన పడ్డదని ఆయన విమర్శించారు. గతంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మేట్పల్లి నుండి బోధన్ వరకు పాదయాత్ర నిర్వహించి బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించటానికి కేంద్రంతో పోరాడి నిధులు సాధిస్తానని రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేనా దీన్ని నడిపిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, గెలిచిన తర్వాత దానిని పూసే మర్చిపోయారని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం , గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటంతో తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రభుత్వపరంగా దాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చి గెలిచి అధికారంలోకి వచ్చి 19 నెలలవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఉప సంఘం వేసి చేతులు దులుపుకుందని దాన్ని నిర్వచించి నడపటానికి ఒక్క రూపాయి నిధులను కేటాయించకుండా , రైతులతో చర్చించకుండా, చెరుకును పండించకుండా, కాలయాపన చేస్తున్నారని, కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు . రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీని అమలు జరపటం లేదని , కౌలు రైతులకు, వితంతువులకు, వికలాంగులకు మరియు వృద్ధులకు పెన్షన్ పెంచుతామని చెప్పి మర్చిపోయారని వీటన్నిటినీ ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి నిధులను కేటాయించాలని లేని యెడల గత ప్రభుత్వానికి ప్రజలు ఏ విధంగానైతే అధికారానికి దూరం చేశారో ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలు ఈ ప్రభుత్వానికి అదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో సిపిఎం బోధన్ ఏరియా కార్యదర్శి శంకర్ గౌడ్, ఏరియా కార్యదర్శి వర్గం సభ్యులు యేశాల గంగాధర్, జంగం గంగాధర్, ఏరియా కమిటీ సభ్యులు సుందరి కుమారస్వామి, కుక్రియాల బాలయ్య మరియు అర్జున్, గోపి , తోకల దత్తు, బేకరీ గంగాధర్ , పత్రి ఎల్లన్న సిపిఐఎం పార్టీ బోధన్ ఏరియా కార్యదర్శ వర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








