V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో షర్బత్ కెనాల్ పనులను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్…

SHARE:

బోధన్ పట్టణ కేంద్రంలో జరుగుతున్న షర్బత్ కెనాల్ కల్వర్టు పనులను నిజామాబాదు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఐపీఎస్ గారు శనివారం పర్యవేక్షించారు.
 
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ బోధన్ నుండి నిజామాబాదు రూట్‌లో ప్రజలకు, వాహనదారులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పాదచారులు సురక్షితంగా ప్రయాణించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పూర్తిస్థాయి బందోబస్తు ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
 
అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు డైవర్షన్స్ సక్రమంగా అమలు చేసి వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
 
ఈ కార్యక్రమంలో బోధన్ ఏసిపి శ్రీనివాస్, టౌన్ ఎస్‌హెచ్‌ఓ శ్రీ వెంకటనారాయణ, ట్రాఫిక్ సిఐ శ్రీ చందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india